Kaizer News

ఘనంగా ముగిసిన మండల స్థాయి ఎస్జీఎఫ్‌ క్రీడా పోటీలు

ఘనంగా ముగిసిన మండల స్థాయి ఎస్జీఎఫ్‌ క్రీడా పోటీలు

· Sports · prabhanews.com

మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండల స్థాయి ఎస్జీఎఫ్‌ (స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌) క్రీడా పోటీలు శనివారం విజయవంతంగా ముగిశాయని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, పీడీ గుండెల్లి రాజయ్య తెలిపారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన అండర్‌–14 బాలబాలికలు సుమారు 150 మంది క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు భాగ్యశ్రీ, ముఖ్య అతిథిగా హాజరైన యూత్‌ ఫర్‌ సేవ సంస్థ సభ్యుడు పోలినేని రామారావు మాట్లాడుతూ క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడా స్ఫూర్తి, ఓర్పు, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు చదువులో అన్వేషించే, ప్రశ్నించే గుణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేసుకొని సమాధానాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీడీలను అభినందిస్తూ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీలు రాజయ్య, సందీప్‌, మహేష్‌, సంతోష్‌, అజయ్‌, కార్తీక్‌, సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న, సురేందర్‌, అనిల్‌ కుమార్‌, కుమారస్వామి, ప్రవీణ్‌, రాజు, కళ్యాణి, లలిత, పద్మ, సీనియర్‌ క్రీడాకారుడు రాజు, కమలాకర్‌, విద్యార్థినీ విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News