ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ‘సత్యమేవ జయతే’ అంటూ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై ఆయన ఎక్స్ వేదికగా శుక్రవారం హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌రెడ్డి ఫిరాయింపు రాజకీయాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని ధీమా వ్యక్తంచేశారు