Kaizer News

అతివృద్ధ పర్వతారోహకుడు

అతివృద్ధ పర్వతారోహకుడు

· State - Telangana · sakshi.com

నడివయసులోకి వచ్చాక చాలామంది మెట్లెక్కడానికే ఆయాసపడతారు. తొంభైఏళ్లు దాటిన ఈ అమెరికన్‌ వృద్ధుడు మాత్రం పడుతూ లేస్తూ... మొత్తానికి పర్వత శిఖరాన్నే అధిరోహించాడు. అమెరికా ఈశాన్యాన ఉన్న న్యూఇంగ్లండ్‌ ప్రాంతంలోని ‘మౌంట్‌ మీన్‌’ శిఖరాన్ని అధిరోహించిన ఈ పెద్దాయన పేరు డేల్‌ సాండర్స్‌. ఈయన వయసు 91 ఏళ్లు. ‘మౌంట్‌ మీన్‌’ శిఖరారోహణ కోసం ఈ పెద్దమనిషి జార్జియాలోని స్ప్రింగర్‌ పర్వతం నుంచి న్యూఇంగ్లండ్‌లోని ‘మౌంట్‌ మీన్‌’ వరకు ఏకంగా 3,529 కిలోమీటర్లు కొండదారిలో ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో ఆయన 71 సార్లు జారిపడ్డాడు. పడిన ప్రతిసారీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో తిరిగి పైకిలేచాడు. పట్టువదలకుండా, విజయవంతంగా శిఖరారోహణ చేశాడు. ఈ శిఖరాన్ని అధిరోహించడం సాండర్స్‌కు ఇదే మొదటిసారి కాదు, ఇదివరకు 2017లో కూడా తన 82 ఏళ్ల వయసులోనూ ఆయన ఈ శిఖరాన్ని అధిరోహించాడు. తాజాగా తన రికార్డును తానే పునరావృతం చేశాడు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News