Kaizer News

వారెన్ బఫెట్ రాజీనామా..కొత్త చైర్మన్‌‌‌‌గా ఆయన కొడ

వారెన్ బఫెట్ రాజీనామా..కొత్త చైర్మన్‌‌‌‌గా ఆయన కొడుకు హోవార్డ్ బఫెట్

· State - Telangana · v6velugu.com

న్యూఢిల్లీ: సీనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (96) తన పెట్టుబడులను నిర్వహించే బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ హాథ్‌‌‌‌‌‌‌‌వే కంపెనీ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఇక నుంచి గౌరవ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతారు. కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఆయన కుమారుడు, 1993 నుంచి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా సేవలందిస్తున్న హోవార్డ్ బఫెట్ నియమితులయ్యారు. గ్రెగ్ అబెల్ సీఈఓగా కొనసాగనున్నారు.1965 నుంచి బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌కు సేవలు అందిస్తున్నానని, 60 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగం తనకే ఉందని వాటాదారులకు రాసిన లేఖలో బఫెట్ పేర్కొన్నారు. బఫెట్‌‌‌‌‌‌‌‌ సంపద ప్రధానంగా బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ షేర్ల రూపంలో ఉండగా, ఆయన సంపద విలువ 140 బిలియన్ డాలర్లకు చేరింది

Original source: v6velugu.com
Read more on Kaizer News