Kaizer News

NTR District: నిత్యావసర ధరల పెరుగుదలపై జాయింట్ కలె

NTR District: నిత్యావసర ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్‌కు వైసీపీ వినతిపత్రం

· State - Telangana · hmtvlive.com

ఎన్టీఆర్ జిల్లా: నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్న నేపథ్యంలో, ధరలను నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ గారికి ఎన్టీఆర్ జియా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తిరువూరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు, మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ జిల్లా అధ్యక్షులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే విధంగా నిత్యవసర సరుకులు ధరలు పెంచుతున్నారు. తినటానికి కూడా లేకుండా ధరలు పెంచేస్తున్నారు. వారం నుంచి ప్రభుత్వ అనుకూల మీడియా కూడా వీటి గురించి చెబుతుంది. ఏ కూటమి నాయకుడు ధరలు గురించి మాట్లాడటానికి సాహసం చేయటం లేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ధరలు పెంచను అని చెప్పారు ఇప్పుడు ఏమి అయిపోయాడు, ధరలు తగ్గించకపోతే చొక్కా పట్టుకొని నిలదీయమన్నాడు మహిళలు అందరూ దానికి సిద్ధంగా ఉన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు ఏమి సమాధానం చెబుతారు. జగన్ ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు వచ్చాయి అని మహిళలు చెబుతున్నారు. జగన్ కన్నా ఎక్కువ పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి మోసం చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, దాని కన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు. 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని గుడులు కూల్చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక కూల్చిన ప్రతి గుడిని కట్టారు. ఇంట్లో విషయాలను కులాలకి మతాలకు అంతకడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ధరలు తగ్గించాలి. ధరలు తగ్గించాలని జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందించారు. బియ్యం,నూనెలు,పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుంది. ప్రజలు ఏ విధంగా జీవనం సాగించాలి ప్రభాతం సమాధానం చెప్పాలి. రేషన్ బియ్యం మాఫియా ద్వారా బయటకు పంపిస్తున్నారు. ధరలు పెరుగుతున్న ప్రభుత్వం స్పందించటం లేదు. స్టోర్లు,రైతు బజార్లు ద్వారా ధరలు తగ్గించి అమ్మాలి. దేశంలో నేను సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు వలన ఎవరికి ఉపయోగం చంద్రబాబుకి ముని శాపం ఉందని గతంలో YSR చెప్పారు అదే నిజం. అప్పులు విపరీతంగా చేశారు కనీసం పథకాలు కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి ఇస్తాను అన్నారు ఎవరికి ఇచ్చారు. మఠాలను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు, వైసీపీ నీ ఎదిరించలేక అవాస్తవాలు మాట్లాడుతున్నారు. మత మార్పిడి ఎవరిని చేశారో చెప్పాలి నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలి. ధరలు కూటమి హయంలో ఎలాగ పెరిగాయో జాయింట్ కలెక్టర్ కి చెప్పాం, కేంద్రం,రాష్ట్రంలో అధికారంలో ఉంది మీ పార్టీలే, ఎందుకని ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. పాలు, పెట్రోల్, నిత్యవసర వస్తువులు ధరల

Original source: hmtvlive.com
Read more on Kaizer News