Kaizer News

Nagarkurnool: గణనాథునికి 18వ వార్డు కౌన్సిలర్ పోతు

Nagarkurnool: గణనాథునికి 18వ వార్డు కౌన్సిలర్ పోతుల చంద్రకళ పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన మహాగణపతి నిమజ్జన కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పోతుల చంద్రకళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కాలనీవాసుల సుఖసంతోషాలను ఆకాంక్షించారు. మహాగణపతిని ఏర్పాటు చేసిన దంపతులు ఎస్. సునీత–బ్రహ్మం దంపతులను 18వ వార్డు కౌన్సిలర్ పోతుల చంద్రకళ శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం కాలనీవాసులైన బైరోజు రేవతమ్మ కుమారుడు బైరోజు నవీన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ పోతుల చంద్రకళతో పాటు ఎస్. సునీత–బ్రహ్మం దంపతులను శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా 18వ కౌన్సిలర్ పోతుల చంద్రకళ మాట్లాడుతూ.. మహాగణపతి ఆశీస్సులు శ్రీనగర్ కాలనీ వాసులపై, నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్నోజు వెంకటమ్మ, చందన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News