Annamayya: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, గారి ఆదేశాలతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు శనివారం రాత్రి గ్రామాల్లో 'పల్లె నిద్ర' చేపట్టారు. అధికారులు స్థానిక ప్రజలు, యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల వేళ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పిస్తూ, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి భద్రతకు సహకరించాలని కోరారు