Kaizer News

బీఆర్ఎస్ భూ దోపిడీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ

బీఆర్ఎస్ భూ దోపిడీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి : ప్రొ.సింహాద్రి యాదవ్

· State - Telangana · v6velugu.com

తార్నాక, వెలుగు: 1,200 మంది అమరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన భూ దోపిడీపై సుప్రీంకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని సమాజ్​వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తార్నాకలోని పార్టీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబసభ్యుల భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి, భూములను స్వాధీనం చేసుకొని అమరుల కుటుంబాలు, పేదలు, దళితులు, తెలంగాణ ఉద్యమకారులు, వెనకబడిన తరగతులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఆధారాలతో ప్రభుత్వం ప్రకటించినందున ఎటువంటి జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు శ్రీరాములు, శ్రీనివాసులు, మహమ్మద్ రిజ్వాన్ హుస్సేన్, మహమ్మద్ వాజిద్ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News