Kaizer News

Deepanshu Shokeen: ఢిల్లీ వర్సిటీలో చరిత్ర సృష్టిం

Deepanshu Shokeen: ఢిల్లీ వర్సిటీలో చరిత్ర సృష్టించిన దీపాంశు.. తొలి స్వతంత్ర అభ్యర్థిగా ఘనవిజయం.. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐలకు భారీ షాక్

· National - India · 10tv.in

> Deepanshu Shokeen: దేశ రాజధానిలోని అత్యంత ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో ఊహించని సంచలనం నమోదైంది. ఉపాధ్యక్ష పదవికి జరిగిన హోరాహోరీ పోరులో ఇండిపెండెంట్ అభ్యర్థి దీపాంశు షోకీన్(Deepanshu Shokeen) చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ (ABVP), ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అభ్యర్థులకు గట్టి షాక్ ఇస్తూ, భారీ మెజార్టీతో ఆయన ఉపాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. డీయూఎస్‌యూ ఎన్నికల చరిత్రలోనే ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్న తొలి స్వతంత్ర అభ్యర్థిగా దీపాంశు రికార్డు సృష్టించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టండి.. ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్ పిలుపు పశ్చిమ ఢిల్లీలోని పీరగఢీకి చెందిన దీపాంశు సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న యువకుడు. ఆయన తండ్రి బస్ కండక్టర్‌గా, తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. భగత్ సింగ్ కళాశాలలో విద్యనభ్యసించిన ఆయన, యూపీఎస్‌సీకి సిద్ధమవ్వాల్సి ఉన్నప్పటికీ విద్యార్థి రాజకీయాల వైపు అడుగులు వేశారు. గతంలో సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ కూలిన ఘటనలో బాధితులకు న్యాయం జరిగే వరకు చెప్పులు ధరించనని శపథం చేసి వార్తల్లో నిలిచారు. మొదట ఎన్‌ఎస్‌యూఐ నుంచి నామినేషన్ వేసినప్పటికీ, ఆ సంస్థ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడంతో స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం నాలుగు ప్రధాన పోస్టులకు జరిగిన ఈ ఎన్నికల్లో మిగిలిన మూడు స్థానాలను ఏబీవీపీ తన ఖాతాలో వేసుకుంది. అధ్యక్షుడిగా ఏబీవీపీ అభ్యర్థి యశ్ దబాస్, ఎన్‌ఎస్‌యూఐ ప్రత్యర్థి విజయ్ మీనాపై విజయం సాధించారు. అలాగే సెక్రటరీ పదవిని ఏబీవీపీకి చెందిన రియా ఛావ్డి దక్కించుకోగా, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ ఎన్నికయ్యారు. ఎన్‌ఎస్‌యూఐ తీవ్ర నిరాశ పరిచిన ఈ ఎన్నికల్లో ఏబీవీపీ ప్రాబల్యం చాటుకున్నప్పటికీ, దీపాంశు సాధించిన సంచలన విజయం అత్యంత ప్రధాన చర్చనీయాంశంగా మారింది

Original source: 10tv.in
Read more on Kaizer News