ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న మత్స్యకార సంఘాలు మత్స్యకారులను ఎల్‌నినో చావుదెబ్బ కొట్టింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా జాలర్ల జీవితం అల్లకల్లోలంగా మారింది. ఎండల తాకిడి చెరువులు అడుగంటడంతో చేపల వేట ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పొట్టపోషణ సైతం కష్టతరంగా మారిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకుల ఉపాధికి అలమటించాల్సి దుస్థితి దాపురించింది. నీరు లేక చెరువుల్లో వదిలిన చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకార సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.తమ కుటుంబాలకు జీవనాధారం కల్పించి అండగా నిలవాలని విన్నవిస్తున్నారు. కాణిపాకం : చేపల పెంపకం, అమ్మకాలనే నమ్ముకు ని జీవనం సాగిస్తున్న మత్స్యకారులపై ఎల్‌నినో ప్రభావతం తీవ్రంగా పడింది. వర్షాభావ పరిస్థితు లు, మండే ఎండల కారణగా చెరువులన్నీ మైదానాల ను తలపిస్తున్నాయి. కళ్లు కాయలు కాచేలా వర్షాల కోసం నిరీక్షిస్తున్న మత్స్యకారులకు నిరాశే మిగులు తోంది. చెరువులు అడుగంటిపోవడంతో చేపల పెంపకం దెబ్బతిని, వారి కుటుంబాలు పూట గడవక అల్లాడిపోతున్నాయి. జిల్లాలోని 28 మండలాల పరిధిలో మొత్తం 197 చెరువులతో పాటు ప్రతిష్టాత్మకమైన అమ్మపల్లి రిజర్వాయర్ మత్స్యకారులకు ప్రధాన నీటి వనరుగా ఉంది. వీటి ఆధారంగానే వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. సాధారణంగా ఈ నీటి వనరుల్లో కట్ల, రోహు, మోసు, బంగారుతీగ, గడ్డి చేప, పాంప్లెట్, పంగాస్, కొర్రమీను, జిలేబి వంటి వివిధ రకాల చేపలను విస్తారంగా పెంచుతుంటారు. కానీ, ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే 50 శాతానికి పైగా చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. రాబోయే రోజుల్లోనూ వర్షాలు పడకపోతే చేపల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. సాధారణంగా సీజన్‌లో వారానికి సుమారు 10 నుంచి 12 టన్నుల చేపల ఉత్పత్తి జరిగేది. కానీ, ప్రస్తు తం చెరువుల్లో నీటి మట్టం ఘోరంగా పడిపోవడంతో వారానికి కేవలం 3 టన్నుల దిగుబడి మాత్రమే వస్తోంది.జిల్లాలోని కుప్పం, బైరెడ్డిపల్లె, రామకుప్పం, శాంతిపురం, పెద్దపంజాణి, పలమనేరు, గంగావరం, బంగారుపాళ్యం మండలాల పరిధిలోని చెరువుల్లో పరిస్థితి కొంతవరకు నయంగా ఉన్నప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం