Kaizer News

Tadigadapa: తాడిగడపలో రూ.కోటి సీసీ రోడ్డు ప్రారంభం

Tadigadapa: తాడిగడపలో రూ.కోటి సీసీ రోడ్డు ప్రారంభం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్

· State - Telangana · hmtvlive.com

Shorts Tadigadapa: అభివృద్ధికి అడుగు కాదు...ప్రతి రోజూ ఒక అభివృద్ధి కార్యక్రమం,తాడిగడప మున్సిపాలిటీలో కోటి రూపాయల నిధులతో నిర్మించిన రహదారి మరియు డ్రైనేజీని ప్రారంభించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు... తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ,కానూరు తులసీనగర్ ప్రధాన రహదారిని టీచర్స్ కాలనీ ప్రధాన రహదారితో అనుసంధానం చేస్తూ,మన కళ్యాణ మండపం నుంచి సనత్‌నగర్ వరకు సుమారు రూ.1 కోటి వ్యయంతో సిమెంట్ రోడ్డు,ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థతో నిర్మించిన రహదారిని,ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ప్రారంభించారు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ... గతంలో మన కళ్యాణ మండపం రోడ్డును ప్రారంభించామని,ఇప్పుడు తులసీనగర్ ప్రధాన రహదారి పనులను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. గత రెండున్నరేళ్లలో తాడిగడప మున్సిపాలిటీలో సుమారు రూ.70–80 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాం,అభివృద్ధి అంటే ఒకరోజు కార్యక్రమం కాదు,ఇకపై కూడా ప్రతిరోజూ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తాం అని తెలిపారు. మున్సిపాలిటీలో మట్టి రోడ్లు,అధ్వాన్నంగా ఉన్న రోడ్లను సిమెంట్ రోడ్లుగా మార్చేందుకు సుమారు రూ.50 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అలాగే కృష్ణా నది నుంచి తాడిగడప మున్సిపాలిటీలోని నాలుగు గ్రామాలకు మంచినీటిని అందించే భారీ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు,భవిష్యత్తులో బోర్‌వెల్స్‌పై ఆధారపడకుండా ప్రజలకు శాశ్వత మంచినీటి పరిష్కారం కల్పించడమే లక్ష్యమన్నారు. డ్రైనేజీ,స్టార్మ్ వాటర్ డ్రైన్ల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అవసరమైన చోట అవుట్‌ఫాల్ కనెక్టివిటీ,ప్రధాన డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. నా దగ్గరకు ప్రజలు వస్తే వెంటనే పని జరిగిపోవాలని కోరుకుంటారు,కానీ నా దగ్గర మంత్రదండం లేదు...అక్షయపాత్ర లేదు,ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులను తీసుకురావడానికి నా శక్తిమేరకు ప్రయత్నించే బాధ్యత మాత్రం నాది,ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతాను అని రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, మాస్టర్ ప్లాన్ రోడ్లు తదితర మౌలిక వసతుల రంగాల్లో రాబోయే రోజుల్లో మరింత భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటే లక్ష్యం... అభివృద్ధి పనులే బోడే ప్రసాద్ గారి బాట ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News