Kaizer News

పెంజర్ల గ్రామంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి తనిఖీలు

పెంజర్ల గ్రామంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి తనిఖీలు

· State - Telangana · prabhanews.com

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి: కొత్తూరు మండలం పెంజర్ల గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి శనివారం పరిశీలించారు. గ్రామంలో పర్యటించిన ఆమె వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించి వాటి నిర్వహణపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీల్లో మొక్కల సంరక్షణ, పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, చిన్నారులకు పౌష్టికాహారం, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News