Kaizer News

Ramayana | రణబీర్ ‘రాముడి’ లుక్ కోసం స్పెషల్ VFX..

Ramayana | రణబీర్ ‘రాముడి’ లుక్ కోసం స్పెషల్ VFX.. ‘రామాయణ’పై మేకర్స్ భారీ ఫోకస్!

· Entertainment · ntnews.com

Ramayana | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కథానాయకుడిగా, దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్‌లో కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. తాజా సమాచారం ప్రకారం ‘రామాయణ’లో రణబీర్ కపూర్ పోషిస్తున్న శ్రీరాముడి పాత్రకు సంబంధించిన లుక్‌పై చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందట. రణబీర్‌ను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా శ్రీరాముడి పాత్రలో చూపించేందుకు అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖకవళికలు, పాత్రకు అవసరమైన భావోద్వేగాలు, విజువల్ ప్రెజెంటేషన్ మరింత సహజంగా కనిపించేలా ప్రత్యేకంగా VFX వర్క్ జరుగుతోందని సమాచారం. రణబీర్ లుక్‌తో పాటు సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి గెటప్‌పైనా మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారట. సాయి పల్లవి సహజమైన నటనకు ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో, ఆమెను సీత పాత్రలో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. పురాణ గాథలోని పాత్రల స్వచ్ఛత, భావోద్వేగాలను కాపాడుతూనే నవతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఆమె పాత్రను డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని కేవలం సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందిస్తున్నట్లు సమాచారం. పాత్రల హావభావాలు, యాక్షన్ సన్నివేశాలు, భారీ యుద్ధ ఘట్టాలు అత్యంత సహజంగా, గ్రాండ్‌గా కనిపించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ప్రస్తుత తరం ప్రేక్షకులకు సుపరిచితమైన టెక్నాలజీ, అద్భుతమైన విజువల్ వండర్స్‌ను అందిస్తూనే రామాయణంలోని మూల కథ, భావోద్వేగాలను ఏమాత్రం దెబ్బతీయకుండా చిత్రబృందం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటిగా నిలవనుంది. సినిమా విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, ప్రొడక్షన్ డిజైన్ కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గ నిపుణులు కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. భారీ సెట్లు, అత్యాధునిక సాంకేతికతతో భారతదేశంతో పాటు విదేశాల్లోనూ షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పురాణ గాథను అంతర్జాతీయ స్థాయి విజువల్ అనుభూతిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం

Original source: ntnews.com
Read more on Kaizer News