Kaizer News

నిరుపేద కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే…

నిరుపేద కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే…

· State - Telangana · prabhanews.com

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్‌ భగత్‌సింగ్‌ నగర్‌ హట్స్‌ ప్రాంతానికి చెందిన సతీష్‌ హెయిర్‌ సెలూన్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం నాయి బ్రాహ్మణ సంఘం నాయకుల ద్వారా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దృష్టికి వెళ్లింది. విషయం తెలుసుకున్న నల్లాల ఓదెలు వెంటనే స్పందించారు. శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతుడి కుమార్తె చదువుకు సంబంధించిన ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుమార్తె విద్య కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరుపేద కుటుంబానికి విద్యాపరంగా అండగా నిలవడం పట్ల కుటుంబ సభ్యులు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు నల్లాల ఓదెలుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్య కొనసాగించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గాండ్ల సమ్మయ్య, నందిపేట సదానందం, పాఠశాల ఉపాధ్యాయులు ఎం.వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వరరావు, తేజావత్‌ రామకృష్ణ నాయక్‌, పీడీ రాజేంద్రప్రసాద్‌, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు సూత్రాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News