Kaizer News

Parkal: ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకోవాలి: వ్యవస

Parkal: ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకోవాలి: వ్యవసాయ శాఖ!

· State - Telangana · hmtvlive.com

Shorts పరకాల: పరకాల డివిజన్ పరిధిలోని రైతులు ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. రైతులు సంబంధిత ఎరువుల డీలర్ల వద్ద లేదా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఉచితంగా ఎరువులను బుక్ చేసుకోవచ్చు. అలాగే మీ సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా కూడా ఎరువులను బుక్ చేసుకోవచ్చు. రైతులు ఆధార్ నంబర్ లేదా ఫార్మర్ ఐడీ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఫార్మర్ ఐడీ లేని రైతులు ఆధార్ నంబర్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. సంబంధిత వెబ్‌సైట్/framework for fertilizer sale యాప్ ద్వారా కూడా ఎరువుల బుకింగ్ చేసుకోవచ్చు. రైతులకు యాప్‌లో భూమి వివరాలు కనిపించకపోతే, సరైన భూమి పత్రాలతో సంబంధిత వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. అధికారులు భూమి వివరాలను పరిశీలించి ఆమోదించిన అనంతరం ఎరువుల బుకింగ్ చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రం లేదా CSC ద్వారా ఎరువుల బుకింగ్‌కు రూ.30 రుసుము నిర్ణయించబడింది. రైతులు చివరి సమయంలో ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో ఎరువులను బుక్ చేసుకోవాలని పరకాల వ్యవసాయ సహాయ సంచాలకులు జాలిగప్ అవినాష్ సూచించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News