Kaizer News

రియాద్‌ విమానాశ్రయంపై దాడి?

రియాద్‌ విమానాశ్రయంపై దాడి?

· National - India · ntnews.com

ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో భారీగా పొగలు విమాన సర్వీసులు రద్దు! రియాద్‌: సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శనివారం భారీగా నల్లని పొగలు, మంటలు కనిపించాయి. ఈ ఘటనతో విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు ‘రాయిటర్స్‌’ పేర్కొన్నది. సౌదీ అరేబియాలో వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ చేసిన కొద్ద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకు దారి తీసింది. అయితే ఈ మంటలు, పొగలకు కారణమేమిటన్నది అధికారికంగా వెల్లడికాలేదు. ఇరాన్‌ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో రియాద్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు ఎగసిపడటంతోపాటు దట్టమైన నల్లని పొగలు ఆకాశంలో వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానాల ట్రాకింగ్‌ డాటా ప్రకారం రియాద్‌ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు గణనీయంగా ఆలస్యమైనట్లు సమాచారం. అలాగే విమానాశ్రయంలోని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తున్నది. కాగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News