Kaizer News

Vijaya Sai Reddy Letter: ఏపీని ఐదేళ్లు పాలించింది

Vijaya Sai Reddy Letter: ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ!

· State - Telangana · telugu.abplive.com

విజయసాయిరెడ్డి తనపై నమ్మకద్రోహి ప్రచారం ఖండించి, సజ్జల ఆధిపత్యం వివరించారు. 2019 నుంచి సజ్జల పార్టీని నడిపారు, జగన్ రెండో స్థానమయ్యారని ఆరోపించారు. ఆత్మగౌరవం దెబ్బతినడంతో రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. సజ్జల జగన్‌ను పార్టీలో ఒంటరి చేసి అవమానించారని లేఖలో పేర్కొన్నారు. Vijaya Sai Reddy Letter: వైసీపీ తనపై నమ్మద్రోహి అని తప్పుడు ప్రచారం చేస్తుందని అందుకే కొన్ని విషయాలపై క్లారిటీ ఇస్తున్నానంటూ ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వరకు పార్టీలో జగన్‌దే నెంబర్ వన్ పొజిషన్‌గా ఉండేదని, కానీ సజ్జల వచ్చాక పరిస్థితులు మారిపోయాయని అన్నారు. ఇప్పుడు జగన్ రెండో స్థానంలో ఉన్నారని, పార్టీని సజ్జల లీడ్ చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సజ్జల మాట చెల్లుబాటు అవుతుందని, జగన్‌ది ప్రేక్షక పాత్రేనని విమర్శించారు. విజయసాయి రెడ్డి రాసి పూర్తి లేఖ యథావిధిగా ఇక్కడ చదువుకోవచ్చు. "వైయస్సార్సీపీ "కోటరీ" నా మీద "నమ్మక ద్రోహి" అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచార పోస్టులు పెట్టిస్తున్నందున ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ చార్జిషీట్‌లో నా పేరు లేకుండా చేసుకునేవాడిని. జగన్‌కి నమ్మకస్తుడిని అనే ఒకే ఒక్క కారణంగా జగన్‌తో పాటు ప్రతి చార్జిషీట్లోనూ నన్ను ఎ-2గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. జగన్‌ను 16 నెలలు జైల్లో ఉంటే నన్ను 15 నెలలు జైల్లో పెట్టారు. నమ్మక ద్రోహం నా రక్తంలో ఉంటే, అప్పుడే అప్రూవర్గా మారేవాడిని. 2024 ఎన్నికల తర్వాత కూడా నాకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో నన్ను ఎ-5గా చేర్చారు. కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2 గా చేర్చారు. ఈ రెండున్నర ఏళ్ల టీడీపీ పాలనలో "సకల శాఖల మంత్రి" పేరు మాత్రం ఇంతవరకు ఏ చార్జిషీట్లోనూ లేదు. జగన్‌కి వెన్నుపోటు పొడుస్తూ, ఆయనకు తెలవకుండా టీడీపీ తో కలిసి ఎలా పని చేయాలో, ఏ కేసులూ లేకుండా ఎలా చేసుకోవాలో అక్కడ ఉన్న "కోటరీ నాయకుడు"కి తెలిసినంత నాకు తెలవదు. నేను ఏనాడూ అలాంటి నమ్మక ద్రోహం పనులు చేయలేదు. ఇప్పుడు పార్టీ మారటానికి రెడీగా ఉన్న "ఉత్తరాంధ్ర నాయకుడు"తో కలిసి ఈ కోటరీ నాయకుడే 2020నుంచి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా, నా మీద విపరీతంగా చాడీలు చెప్పించి నన్ను ఉత్తరాంధ్ర బాధ్యతలనుంచి తప్పించటానికి కారణం అయ్యాడు. జగన్ మెప్పు పొందడానికి నాస్తికుడుగా, కమ్యూనిస్ట్ గా చెప్పుకునే ఇతను వైఎస్సీపీకే కాదు, రాష్ట్రానికే నమ్మకద్రోహి. కుటుంబం కోసం 40ఏళ్ళు అత్యంత నమ్మకస్తుడిగా పని చేసిన నేను, నా ఆత్మగౌరవానికి 2020 నుంచి భంగం కలిగించింది ఎవరు? నన్ను PMOలో కాని, ఢిల్లీలో కాని, పార్టీలో కాని, అవమానకరంగా అంచలంచెలుగా తగ్గించింది ఎవరు ? పొమ్మనలేక పొగ పెట్టింది ఎవరు? అతిపెద్ద 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల ప్రమేయం ఎలా శృతి మించింది. పార్టీకి నా సేవలు ఏంటి, సజ్జల ద్రోహం ఏంటి? పరిపాలన జగన్ చేశారా?, "సజ్జల" సకల శాఖ మంత్రిగా, ఒక రాజ్యాంగేతర శక్తిగా తన ముఠాతో చేసిన పాలనలో, జగన్‌ని, ఎలా ఎవ్వరిని కలవకుండా, MLAలను, MPలను, మంత్రులకు సహిత

Original source: telugu.abplive.com
Read more on Kaizer News