Kaizer News

Adilabad: వాగాపూర్‌లో గణనాథుడికి కలెక్టర్ రాజర్షి

Adilabad: వాగాపూర్‌లో గణనాథుడికి కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా మావల మండలం వాగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం రాత్రి పాల్గొని గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రజల్లో సోదరభావం, ఐక్యతను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం అభినందనీయమని అన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను మండపాల నిర్వాహకులు, గ్రామస్థులు సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ శాఖల సూచనలు, నిబంధనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News