Kaizer News

టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్‌తో రాజకీయ కలకలం!

· State - Telangana · sakshi.com

బెంగళూరు/మైదుకూరు: కర్ణాటక లో చోటుచేసుకున్న భూ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, బెంగళూరు బీజేపీ నేత రవిప్రకాష్‌ మధ్య కొనసాగుతున్న భూ వివాదం కేసులో మైదుకూరు పోలీసులు రవిప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, అరెస్ట్‌ ఘటన కలకలం రేపుతోంది. అయితే, బీజేపీ నేత రవిప్రకాష్‌ను కిడ్నాప్‌ చేశారంటూ ఆయన భార్య సబీనా బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు కార్లలో వచ్చి తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తనను కూడా కొట్టి, ఫోన్లను తీసుకున్నారని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఆయన కుమారుడు రవికుమార్‌లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. తనపై రవిప్రకాష్‌ దాడి చేశారని పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వర్గీయుడు మురళీమోహన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై గత జూలైలోనే కేసు నమోదైనట్లు సమాచారం. ఆ కేసులో భాగంగానే మైదుకూరు పోలీసులు ఇప్పుడు బీజేపీ నేత రవిప్రకాష్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు కిడ్నాప్‌ కేసు.. మరోవైపు దాడి కేసు.. మధ్యలో భూ వివాదం! టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేతల చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) ఇరాన్ ఆర్థిక మూలాలపై ట్రంప్ వేట.. బ్యాంక్ మిస్ర్ కు బిగ్ షాక్! నన్ను కొట్టి ఫోన్ లాక్కొని.. బీజేపీ రవిప్రకాష్ కిడ్నాప్ పై భార్య సంచలన కామెంట్స్ టన్నెళ్లలో కుళ్లిన మృతదేహాలు.. నేపాల్ వరదల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్

Original source: sakshi.com
Read more on Kaizer News