శ్రీలంక క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. 2027 ప్రారంభంలో జరగాల్సిన మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక హక్కులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెనక్కి తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ టోర్నమెంట్‌ను ఇప్పుడు ఏ దేశంలో నిర్వహిస్తారనే విషయంపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకు తొలగించారు? […]