Kaizer News

Redmi Note 17 | రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్ ఫోన్లు

Redmi Note 17 | రెడ్‌మి నోట్ 17 ప్రో సిరీస్ ఫోన్లు విడుద‌ల‌.. ప‌వ‌ర్ ఫుల్ బ్యాట‌రీతో అదిరే ఫీచ‌ర్లు

· National - India · ntnews.com

Redmi Note 17 : చైనాకు చెందిన రెడ్ మి బ్రాండ్ నుంచి నోట్ 17 సిరీస్‌లో ఫోన్లు విడుద‌ల‌య్యాయి. రెడ్‌మి నోట్ 17ప్రో, రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ పేరుతో రెండు ఫోన్ల‌ను సంస్థ లాంచ్ చేసింది. ఇవి రెండూ మీడియం బ‌డ్జెట్ ఫోన్లు. రెండింటిలోనూ 9,000 ఎంఏహెచ్, 10,000 ఎంఏహెచ్ బ్యాట‌రీలున్నాయి. లాంగ్ లైఫ్ చార్జింగ్ కావాల‌ని కోరుకునే వారికి ఈ ఫోన్లు మంచి ఆప్ష‌న్. ఎంపిక చేసిన కార్డుల‌పై డిస్కౌంట్ల‌తోపాటు ఎక్స్‌ఛేంజ్ వంటి ఆఫ‌ర్లున్నాయి. ఈ ఫోన్ల‌లోని ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలివి. రెడ్‌మి నోట్ 17 ప్రో 6.83 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైప‌ర్ ఓఎస్3, స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 4 ప్రాసెస‌ర్, నాలుగేళ్ల‌పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్, 50 ఎంపీ+8ఎంపీ అల్ట్రావైడ్ మెయిన్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 9,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 67 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5 వాట్స్ వైర్డ్ రివ‌ర్స్ ఛార్జింగ్, ఐపీ66+ఐపీ68+ఐపీ69కే రేటింగ్. క్లౌడ్ బ్లూ, ప‌ర్పుల్ వైబ్, స్టెల్త్ బ్లాక్ క‌ల‌ర్స్‌లో ల‌భ్యం. 8జీబీ+128జీబీ వేరియెంట్ ధ‌ర రూ.36,999. 8జీబీ+256జీబీ ధ‌ర రూ.39,999. ఇప్ప‌టికే ఈ ఫోన్ సేల్ ప్రారంభ‌మైంది. రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ 6.83 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10+ డాల్బీ విజ‌న్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైప‌ర్ ఓఎస్3, స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 5 ప్రాసెస‌ర్, నాలుగేళ్ల‌పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్, 50 ఎంపీ+8ఎంపీ అల్ట్రావైడ్ మెయిన్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 10,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 100 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27 వాట్స్ వైర్డ్ రివ‌ర్స్ ఛార్జింగ్, ఐపీ66+ఐపీ68+ఐపీ69కే రేటింగ్. మాచా గ్రీన్, సీక్రెట్ స‌న్‌రైజ్, స్టెల్త్ బ్లాక్ క‌ల‌ర్స్‌లో ల‌భ్యం. 8జీబీ+256జీబీ వేరియెంట్ ధ‌ర రూ.49,999. 12జీబీ+256జీబీ ధ‌ర రూ.55,999

Original source: ntnews.com
Read more on Kaizer News