Kaizer News

Bapatla: తెలుగు భాషకు పురిటిగడ్డ బాపట్ల.. నగరంలో భ

Bapatla: తెలుగు భాషకు పురిటిగడ్డ బాపట్ల.. నగరంలో భాషా దినోత్సవ వేడుకలు!

· State - Telangana · hmtvlive.com

Bapatla: తెలుగు లిపి బాపట్ల లోనే పుట్టింది. తెలుగు తల్లి బాపట్ల లోనే జీవం పోసుకున్నది. తెలుగులో లేఖాసాహిత్యానికి బాపట్ల కు చెందిన కనుపర్తి వరలక్షమ్మ శ్రీకారం చుట్టారు.తెలుగు సాహిత్యం బాపట్ల లోనే ఓనమాలు దిద్దుకుంది. తెలుగు వ్యాకరణ వికాసానికి బాపట్లకు చెందిన భాషా శాస్త్రవేత్తలు బహుముఖంగా కృషి చేశారు.ఈ విధంగా బాపట్ల తెలుగు భాషను సంపన్నం చేసింది. భాషామ తల్లి సేవలో తరించింది. తెలుగు భాషా దినోత్సవవం సందర్భంగా శనివారం ఫోరమ్ ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద గల తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంతకుముందు గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సలీమా, ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, సభ్యులు జివీ , సర్వేయర్ లక్ష్మీనారాయణ,సిబ్బంది మరియు విద్యార్థులుపాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News