Kaizer News

Kodumuru: హరి హర క్షేత్ర ఆలయ నిర్మాణాన్ని పరిశీలిం

Kodumuru: హరి హర క్షేత్ర ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన చలసాని

· State - Telangana · hmtvlive.com

Shorts కోడుమూరు: కోడుమూరులో 21 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర గణేష్ ఉత్సవ ఉత్సవ సమితి అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, వీహెచ్‌పీ నాయకుడు విష్ణు సందర్శించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా రూపొందించిన అద్భుత రాతి కట్టడాలను, ఆలయ ప్రాకారాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. ఇక్కడి ప్రాకారాలు, శిల్పాలను చూస్తుంటే శివ కేశవులిద్దరూ ఒక్కటేననే అద్భుత భావం కలుగుతోందని కొనియాడారు. ఈ భవ్యమైన గుడిని సందర్శించడం వల్ల ఒక గొప్ప మహానుభూతి కలిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలను సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత తెలిపారు.హిందూ ధర్మం ఒక కులానికి ఒక మతానికి చెందినది కాదని భారతీయులు అందరు ఒకటేనని చాటి చెప్పేదే హిందూ ధర్మం అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయల కాలాన్ని తలపించేలా కోడుమూరు నిర్మిస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం దేశంలో నే లిక్కించదక్క దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెదుతుందని తెలిపారు.ఇలాంటి దివ్య క్షేత్రాన్ని నిర్మిస్తున్న ఎద్దుల మహేశ్వర రెడ్డి ఆయన మిత్ర బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు హిందూ సంఘాల నాయకులు నాగేశ్వరరావు, తయ్యప తదితరులు పాల్గొనారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News