Kaizer News

ఖరీఫ్ ‘ఖాళీ’.. పల్నాడులో కరువు కేక!

ఖరీఫ్ ‘ఖాళీ’.. పల్నాడులో కరువు కేక!

· State - Telangana · prabhanews.com

పసిడి నేలలో నెర్రలు.. ఆశలు ఆవిరి ఎల్‌నినో ప్రభావంతో సాగు బేజారు.. అడుగంటుతున్న భూగర్భజలాలు పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : పసిడి పంటలతో కళకళలాడాల్సిన పల్నాడు సీమ నెర్రలు చాచిన నేలను తలపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌ సీజన్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆగస్టు చివరికి వచ్చినా చినుకు జాడ లేకపోవడం, సాగర్‌ జలాలు సాగుకు అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణ సాగు విస్తీర్ణంలో కనీసం మూడో వంతు కూడా సాగు పనులు జరగకపోవడం, ఇప్పటికే విత్తిన పంటలు ఎండ తీవ్రతకు మాడిపోతుండటంతో రైతాంగం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. సాధారణంగా జిల్లాలో వరి సాగు విస్తారంగా ఉంటుంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. సగటున 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. సాగర్‌ జలాశయం నుంచి సాగుకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని పేర్కొంటున్నారు. వర్షాధార ప్రాంతాల్లో వేసిన వరినారు ముదిరిపోవడంతో నాట్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో వరి సాగు 15,078 హెక్టార్లలోపే ఉండగా, అందులోనూ బోర్ల కింద సాగు చేస్తున్న రైతులే అధికంగా ఉన్నారు. వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే వేసిన వరినారు ముదిరిపోయి నాట్లకు పనికిరాకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. భూముల్లో తేమ లేకపోవడం, ఎండల తీవ్రత పెరగడంతో విత్తిన పంటలు మొలకల దశలోనే ఎండిపోతున్నాయి. కొన్ని పొలాలు బీటలు వారుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 28.13 శాతం విస్తీర్ణంలోనే సాగు పనులు జరిగాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2.15 లక్షల ఎకరాలు ఉండగా, ఇప్పటివరకు 1.18 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనాలు వేశారు. వర్షాలు లేక అవి కూడా ఎండిపోతుండటంతో రైతులు పత్తిపై ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. మిరప నారు సిద్ధంగా ఉన్నప్పటికీ నాటేందుకు నీరు లేక రైతులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు వ్యవసాయ పనులు లేక కూలీలు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ కాలం కరిగిపోతున్నా ఆగస్టు చివరికి కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అప్పుడప్పుడు వర్షం పడుతున్నా భూమి పదునయ్యే స్థాయిలో వానలు లేకపోవడంతో రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మే, జూన్‌ నెలల్లో కురిసిన అరకొర వర్షాలకు కొందరు రైతులు పత్తి పంట వేశారు. ఆగస్టులోనూ ఎండల తీవ్రత కొనసాగడంతో పంటల ఎదుగుదల మందగించింది. భూగర్భజలాలు, ఇతర జల వనరులు అడుగంటడంతో పంటలకు నీరు అందించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 28 మండలాల్లో ఐదు మినహా 23 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 259.43 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 158.40 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో 38.94 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రొంపిచర్ల, నూజండ్ల, ఈపూరు, వినుకొండ, శావల్యాపురం, వెల్దుర్తి, నకరికల్లు, నరసరావుపేట మండలాల్లో అత్యధిక వర్షపాతం లోటు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస

Original source: prabhanews.com
Read more on Kaizer News