గద్వాల: జూరాల ప్రాజెక్టు పరిధిలోని గద్వా ల, ఆత్మకూరు ప్రాంతాల్లో సాగుచేసిన పంటలు కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు అందక ఎండిపోతుండటంతో గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నీరు విడుదల చేయాలని కోరుతూ రోడ్డెక్కి ధర్నా, నిరసన చేస్తున్నారన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి.. రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పంటలకు వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు ఎంపీ ‘సాక్షి’కి తెలిపారు. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!