Kaizer News

Warangal: ఎన్‌ఐటీ వరంగల్ 24వ స్నాతకోత్సవం అట్టహాసం

Warangal: ఎన్‌ఐటీ వరంగల్ 24వ స్నాతకోత్సవం అట్టహాసంగా ప్రారంభం!

· State - Telangana · hmtvlive.com

Shorts Warangal: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ 24వ స్నాతకోత్సవం రెండు రోజుల కార్యక్రమంగా అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. స్నాతకోత్సవం తొలిరోజైన సెప్టెంబర్ 19న 930 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 22 మంది ఎగ్జిట్ డిగ్రీ విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. సెప్టెంబర్ 20న పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా, ఎన్‌ఐటీ వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్ డా. బి.వి.ఆర్. మోహన్ రెడ్డి గౌరవ అతిథిగా, ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది హాజరయ్యారు. అకడమిక్ ప్రొసెషన్, జాతీయ గీతంతో స్నాతకోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్ డా. బి.వి.ఆర్. మోహన్ రెడ్డి 24వ స్నాతకోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది స్వాగత ప్రసంగం, స్నాతకోత్సవ నివేదికను సమర్పించారు. అనంతరం చైర్‌పర్సన్, ముఖ్య అతిథి ప్రసంగాలు, గౌరవ డిగ్రీల ప్రదానం, అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీల ప్రదానం, పతకాలు మరియు అవార్డుల ప్రదానం జరిగాయి. విద్యార్థులు జ్ఞానంతో పాటు విలువలను కూడా జీవితంలో ఆచరించాలి: ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది స్నాతకోత్సవ నివేదికను సమర్పించిన ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుది, స్నాతకోత్సవం విద్యార్థుల జ్ఞానం, పట్టుదల, విజయాలను జరుపుకునే సందర్భమే కాకుండా, వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికే ఘట్టమని అన్నారు. సంస్థలో విద్యా, పరిశోధన, ఆవిష్కరణలు మరియు మౌలిక వసతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. 2026–27 విద్యా సంవత్సరంలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, మెటీరియల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో కొత్త ఎం.టెక్ కార్యక్రమాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో బీటెక్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్‌లో ఎం.ఏ. కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. బీటెక్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌ను తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. పరిశోధన రంగంలో 162 పరిశోధనా ప్రాజెక్టులకు సుమారు రూ.53.63 కోట్ల నిధులు లభించాయని, 2025–26లో 1,771 పరిశోధనా వ్యాసాలు, 617 కాన్ఫరెన్స్ పేపర్లు, 123 బుక్ చాప్టర్లు ప్రచురితమయ్యాయని తెలిపారు. ఈ కాలంలో 36 పేటెంట్లు మంజూరు కాగా, 98 పేటెంట్లు దాఖలయ్యాయని వివరించారు. సంస్థలో దాదాపు రూ.900 కోట్ల విలువైన మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కొత్త హాస్టళ్లు, లెక్చర్ హాల్ కాంప్లెక్సులు, అకడమిక్ బ్లాక్, 2,500 సీట్ల ఓపెన్ యాంఫిథియేటర్, 500 సీట్ల క్యాఫెటీరియా, నార్త్–సౌత్ అండర్‌పాస్ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు ఇందులో భాగమని చెప్పారు. ప్లేస్‌మెంట్లలో అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 93.94 శాతం, పీజీ విద్యార్థుల్లో 80.78 శాతం మంది ఉద్యోగాలు పొందారని, అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సగటు వేతనం రూ.18.54 లక్షలు

Original source: hmtvlive.com
Read more on Kaizer News