Madanapalle: తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో మదనపల్లె బైపాస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కోళ్లు రవీంద్రను మదనపల్లె నియోజకవర్గ తెలుగుయువత నాయకులు ఉమేష్ బోనాల, సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రితో కొద్దిసేపు చర్చించారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగింది