Shorts కందుకూరు: ప్రకాశంజిల్లా కందుకూరు.. సాధారణంగా 24 గంటల సుదీర్ఘ సమయం పట్టే అత్యంత క్లిష్టమైన పేగు ఆపరేషన్లను సైతం లేటెస్ట్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ విధానం ద్వారా అత్యంత విజయవంతంగా చేయగల సామర్థ్యం యశోద ఆసుపత్రిలో ఉందని డాక్టర్ కృష్ణ చౌదరి స్పష్టం చేశారు. అలాగే కిడ్నీ, అండాశయ (ఓవరీ), గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర క్లిష్టమైన సమస్యలతో బాధపడే వారికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ అధునాతన రోబోటిక్ మరియు లాప్రోస్కోపిక్ విధానాల్లో కోత చాలా తక్కువగా ఉండటం వల్ల పేషెంట్లు ఆపరేషన్ తర్వాత తక్కువ సమయంలోనే కోలుకుని తమ దైనందిన పనుల్లోకి త్వరగా వెళ్లవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ అత్యాధునిక రోబోటిక్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్సలకు పూర్తి స్థాయి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తిస్తుందని, కాబట్టి రోగులు ఆర్థిక భారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ ఎన్. శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలు ఈ అత్యాధునిక వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని వారు సూచించారు