మరాఠీ చిత్రం 'గోంధల్' ఆస్కార్స్ 2027కు భారత్ నుండి ఎంపికైంది. 33 చిత్రాలను అధిగమించి, సంతోష్ దవాకర్ దర్శకత్వంలో ఈ సినిమా. సైకలాజికల్ థ్రిల్లర్ వివాహ బంధంలోని వంచనను వివరిస్తుంది. ఇఫీలో వెండి నెమలి గెలిచి, జ్యూరీ ప్రశంసలు పొందింది. అకాడమీ అవార్డులు (ఆస్కార్స్ 2027)కు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీపడే అవకాశం అందుకుంది మరాఠీ సినిమా 'గోంధల్' (Gondhal). ఆ సినిమాను ఎంపిక చేసినట్టు ముంబైలో శుక్రవారం (సెప్టెంబర్ 18న) 'ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' జ్యూరీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది ఆస్కార్ రేసులో 30కి పైగా సినిమాలు నిలిచాయి. అందులో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలను వెనక్కి నెట్టి 'గోంధల్' ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీ టికెట్ సొంతం చేసుకుంది. ఇరుముడి, ధురంధర్, హనుమాన్ అంశ్... 33 సినిమాలను వెనక్కి నెట్టిన మరాఠీ 'గోంధల్'! ఈ ఏడాది (2027) ఆస్కార్స్ (99వ అకాడమీ అవార్డుల)కు భారత దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీ స్థానం కోసం మొత్తం 33 సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో విమర్శలకుల ప్రశంసలు అందుకున్న సినిమాలతో పాటు బాక్స్ ఆఫీస్ బరిలో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. 'మె వాపస్ ఆవుంగా', 'బోర్డర్ 2', 'ధురంధర్' వంటి బాలీవుడ్ హిట్స్ మాత్రమే కాదు... 'డగ్ డగ్', 'హక్', 'భమర్దో', '120 బహాదుర్', 'తేరా మేరా నాతా', 'లడ్డూ', 'ఓ మై డాగ్', 'దేవూళ్ బ్యాండ్ 2', 'తిఘీ', 'డోరోతీ', 'ఖూంటా', 'గాంధీ టాక్స్', 'షేప్ ఆఫ్ మోమో', 'గవర్నర్', '2020 ఢిల్లీ', 'కమాండో విన్ లవ్ స్టోరీ', 'ఇక్కిస్', 'ప్రవాస్', 'మన్ ఆత్లే మనాల్తే', 'అబ్సెస్', 'ఎగ్వా', 'అంగ్', లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'హనుమాన్ అంశ్' వంటివి ఉన్నాయి. .. ఎంఎస్ రాజు తీసిన మిస్టిక్ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే? తెలుగు నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన 'పెద్ది', మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన భారీ హిట్ 'ఇరుముడి', సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన 'సింగ్ గీతం' వంటివి ఉన్నాయి. మలయాళ హిట్ 'బాలన్ ది బాయ్', చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన 'బైసన్ కలామడన్' కూడా ఆస్కార్ ఎంట్రీ కోసం పోటీపడ్డాయి. వాటన్నిటినీ దాటుకుని మరాఠీ దర్శకుడు సంతోష్ దవాకర్ తెరకెక్కించిన 'గోంధల్' ఎంపిక కావడం విశేషం. .. గృహప్రవేశంలో తేజస్విని ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు? 'గోంధల్' ఓ సైకలాజికల్ కల్చరల్ థ్రిల్లర్. వివాహ బంధంలో చిక్కుకుని నలిగిపోయే ఓ నవ వధువు చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. పవిత్రమైన జానపద ఆచారంపై తన ప్రియుడికి ఉన్న అమితమైన వ్యామోహాన్ని ఆసరాగా చేసుకుని... వంచన, కామ క్రీడకు తెర తీస్తుంది. ఈ వినూత్న కథ జ్యూరీ సభ్యులను ఆకట్టుకుంది. సంతోష్ దవాకర్ (Santosh Davakhar) దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, కిషోర్ కదమ్, సురేష్ విశ్వకర్మ, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు కీలక పాత్రలలో నటించారు. గోవాలో నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (ఇఫీ)లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కడ వెండి నెమలి అవార్డును అందుకుంది. అయితే... నవంబర్ 2025