Shorts కరీంనగర్: నరేంద్ర మోడీ గత 25 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి సేవ చేస్తూ...భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ నగరానికి పెద్ద ఎత్తున నిధుల వరద కొనసాగుతూ అభివృద్ధి పనులతో నగర రూపు రేఖలు మారాయన్నారు. కరీంనగర్ నగరానికి ఒక వైపు స్మార్ట్ సిటీ, అమృత్, యూఐడిఎఫ్, యూసిఎఫ్ నిధులతో పాటు రైల్వేస్టేషన్ ఆధునీకరణ, ఆర్ ఓ బి, సిఆర్ఎఫ్ లాంటి ఇన్ని రకాల నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రి బండి సంజయ్ కుమార్ నిధులు తెచ్చి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ లో 46 ప్రాజెక్టు పనులకు దాదాపు 40 ప్రాజెక్టులు పూర్తి కాగా 6 ప్రాజెక్టుల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా నగరాభివృద్ధికి 934 కోట్ల నిధులు విడుదల అయిన మాట వాస్తవమన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనుల ద్వారా కరీంనగర్ నగర రూపు రేఖలు మారింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేస్తున్న నాయకులు ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మండి పడ్డారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నా ఏ ఒక్క నాయకుడైనా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఆలోచన చేశారా అని నిలదీశారు. కరీంనగర్ నగర తలాపున మానేరు డ్యాం ఉండి ప్రజలకు ప్రతి రోజు సురక్షితమైన తాగునీరు అందించాలని కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఏ నాయకుడైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమృత్ పథకాన్ని తీసుకొచ్చే వరకు ఏ నాయకుడైనా నగర ప్రజల శ్రేయస్సు పట్టింపు చేశారా అని మండి పడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగర ప్రజల తాగునీటి కోసం అమృత్ పథకంలో 132 కోట్ల నిధులు తెచ్చి కొత్తగా ట్యాంకులు, పైపు లైన్, ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసి ప్రజలకు తాగునీరు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. రెండున్నర సంవత్సరాల కాలంలోనే కరీంనగర్ టూ హన్మకొండ జాతీయ రహదారి నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయని అన్నారు. ఎన్నో ఏళ్లు ఎంతో మంది మంత్రులు, నాయకులు ఉన్నారు కదా... అభివృద్ధి పై ఎందుకు ఆలోచన లేదని ధ్వజమెత్తారు. జగిత్యాల - కరీంనగర్ రహదారికి కూడా అనుమతులు లభించాయని, త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఈ విధంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ నగర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని... పనులను వేగవంతంగా పూర్తి చేసి నగరాన్ని సుందర నగరంగా మారుస్తామన్నారు. నగర ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం భారతీయ జనతా పార్టీని నమ్మి ఓటు వేసి కార్పొరేషన్ లో పాలకవర్గానికి అవకాశం ఇచ్చినందు