Kaizer News

మైనారిటీల సంక్షేమంలో సర్కార్‌ విఫలం

మైనారిటీల సంక్షేమంలో సర్కార్‌ విఫలం

· State - Telangana · ntnews.com

ప్రభుత్వాన్ని ప్రశ్నించని మజ్లిస్‌ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత షేక్‌ అబ్దుల్లా సోహైల్‌ ఫైర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిధుల కోసం పోరాడటంలో ఎంఐఎం పూర్తిగా చేతులెత్తేసిందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ షేక్‌ అబ్దుల్లా సోహైల్‌ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గత రెండు బడ్జెట్లలో మైనారిటీల సంక్షేమ కోసం రూ.5,100.97 కోట్లు కేటాయించి, రూ.1,972.17 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని శాసనసభా వేదికగా ప్రభుత్వమే అంగీకరించిందని సోహైల్‌ గుర్తుచేశారు. మజ్లిస్‌ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో మైక్‌ల ముందే ప్రశ్నిస్తూ మొకుబడి చర్యలకే పరిమితమవుతున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. నిధుల కేటాయిం పు, విడుదల, లబ్ధిదారుల వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సోహైల్‌ డిమాండ్‌ చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News