Kaizer News

రజినీకాంత్ జైలర్-2.. మరో పవర్‌ఫుల్ రోల్ రివీల్..!

రజినీకాంత్ జైలర్-2.. మరో పవర్‌ఫుల్ రోల్ రివీల్..!

· Entertainment · sakshi.com

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు ఆడియన్స్‌ నుంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ క్యారెక్టర్‌ రివీల్ చేశారు. ఆమె కాంతా అనే పవర్‌పుల్ రోల్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెట్లపై నడుచుకుంటూ.. చేతిలో సిగరెట్‌ పట్టుకుని ఫుల్ మాస్‌ లుక్‌లో కనిపించింది బాలీవుడ్‌ బ్యూటీ. (ఇది చదవండి: రజినీకాంత్ జైలర్-2.. సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్‌.. ! ) కాగా.. ఈ భారీ ప్రాజెక్ట్‌ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు) కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్? గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

Original source: sakshi.com
Read more on Kaizer News