యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ హోస్సేన్ షాంటో వ్యవహరించనున్నాడు. అదేవిధంగా దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అఫీషియల్ టెస్ట్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో సత్తాచాటిన తౌహిద్ హృదయ్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్ జాకీర్ అలీ కూడా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. మరోవైపు యువ పేసర్ నహిద్ రానా గాయం కారణంగా అఫ్గాన్‌తో టెస్టుకు కూడా దూరమయ్యాడు. లిట్టన్ దాస్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 9 నుంచి 13 వరకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. కాగా బంగ్లా జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుకు వారి సొంతగడ్డపైన ఓడించిన సంగతి తెలిసిందే. అఫ్గాన్‌తో టెస్టుకు బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్, షాద్మాన్ ఇస్లాం, సౌమ్య సర్కార్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్, ఎబాదోత్ ఇస్లాం, ఎబాదోత్ ఇస్లాం. ట్రావెలింగ్ రిజర్వ్: నయీమ్ హసన్, ముస్ఫిక్ హసన్, ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్ చదవండి: భారత జట్టులో అతడి పేరు చూసి షాకయ్యా! బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!