Kaizer News

Hukumpeta: 435 కేజీల గంజాయి కేసు ఇద్దరు నిందితులకు

Hukumpeta: 435 కేజీల గంజాయి కేసు ఇద్దరు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష!

· State - Telangana · hmtvlive.com

Hukumpeta: హుకుంపేట పోలీస్ స్టేషన్ పరిదిలో 435 కేజీల గంజాయి రవాణా కేసులో ఇద్దరు నిందితులకు 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 8వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2016 జనవరి 18వ తేదీన కొట్నాపల్లి వద్ద వాహన తనిఖీల్లో వ్యాన్లో తరలిస్తున్న 435 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఎ1 నిందితుడు వడ్డేపూడి కోటయ్య న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. ఎ-2 యెలగాల నాగేశ్వర రావు, ఎశీ ధర్మరాజులకు 10 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ న్యాయ స్థానం తీర్పు వెలువరించినట్లు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News