PCC Chief : కాంగ్రెస్‌లో వర్గపోరు, వచ్చే ఎన్నికల్లో పోటీపై చెలరేగుతున్న వివాదాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన పరకాల అసెంబ్లీ టికెట్(Parakala Assembly Ticket)పై మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రేవంత్ చెప్పినంత మాత్రాన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వరు కదా అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. పరకాల టికెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి మాటే ఫైనల్ కాదని, అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి కొండా సురేఖ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె పదవి సేఫ్ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో బీసీలకు సరైన వాటా దక్కలేదని పేర్కొన్న ఆయన.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. ‘తెలంగాణలో మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు తగిన న్యాయం జరగలేదని రాహుల్ గాంధీకి చెప్పాను. అలాంటప్పుడు సురేఖను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగిస్తాం?’ అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అంతేకాదు తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద శాతం అమలు కావడం లేదని అంగీకరించారు పీసీసీ అధ్యక్షుడు. ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి రేవూరి ప్రకాశ్ రెడ్డికే టికెట్ ఖాయమని అన్నారు. దాంతో.. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత 2028లో నేనే పరకాల ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్‌పై.. కొండా సురేఖపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్.. అదేం లేదని చెప్పడం గమనార్హం. బీసీలకు తెలంగాణ మంత్రివర్గంలో సరైన వాటా దక్కలేదు తెలంగాణలో మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు తగిన న్యాయం జరగలేదని రాహుల్ గాంధీకి చెప్పాను అలాంటప్పుడు సురేఖ మంత్రి పదవి ఎందుకు తొలగిస్తాము – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్… pic.twitter.com/kAhrDIGjEC రేవంత్ రెడ్డి మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు అతను చెప్పినంత మాత్రాన టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వరు కదా