Kaizer News

జీవితాన్ని మార్చే అనుభవం

జీవితాన్ని మార్చే అనుభవం

· Entertainment · ntnews.com

అగ్ర కథానాయిక సమంత త్వరలో తల్లి కాబోతున్నది. మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించే అద్భుత క్షణాల కోసం ఆతృతగా ఎదుచూస్తున్నానని సమంత సంబరపడిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. బేబీకి కావాల్సిన అన్ని వస్తువులను కొన్నానని, వాటిని ప్యాక్‌ చేసి జాగ్రత్తగా పెట్టానని చెప్పింది. ప్రెగ్నెన్సీ కారణంగా తాను 11 కిలోల బరువు పెరిగానని, రాత్రిళ్లు విచిత్రమైన కలలు కూడా వస్తున్నాయని తెలిపింది. పుట్టిన పిల్లలకు పాలు పట్టడం, వారికి జోలపాడటం ఇవన్నీ జీవితాన్ని మార్చే గొప్ప అనుభవాలని సమంత ఆనందం వ్యక్తం చేసింది. పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెడతారని ఓ అభిమాని ప్రశ్నించగా..ఆ విషయంలో మీ అందరి సహాయం తీసుకుంటానని సమంత బదులిచ్చింది. ప్రస్తుతం ఈ చిట్‌చాట్‌ సోషల్‌ మీడియాలో అందరిని ఆకర్షిస్తున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News