Kaizer News

గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీఐ

గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీఐ

· State - Telangana · prabhanews.com

శాంతియుతంగా, సురక్షితంగా నిమజ్జనం జరుపుకోవాలి జన్నారం, ఆంధ్రప్రభ : గణేష్ నవరాత్రుల సందర్భంగా జన్నారం మండలంలోని పొనకల్, కలమడుగు గ్రామాల్లో గణేష్ నిమజ్జన ప్రదేశాలను లక్షెట్టిపేట సీఐ డి. రమణమూర్తి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఆయా గ్రామాల సమీపంలోని గోదావరి నది, వాగులను క్షేత్రస్థాయిలో సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వాహనాల రాకపోకలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని సీఐ కోరారు. ఆయన వెంట స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్, కాంగ్రెస్ నేత బొంతల మల్లేష్ ఉన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News