జాతీయ స్థాయిలో ఐక్యత మాట.. రాష్ట్రాల్లో మాత్రం వేర్వేరు రాజకీయ లెక్కలు 2027 ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటు, సమన్వయమే ప్రధాన సవాల్ INDIA Bloc Alliance | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ఇండియా( INDIA) కూటమికి రాష్ట్రాల రాజకీయాలు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. జాతీయ స్థాయిలో ఉమ్మడి వేదికపై కనిపిస్తున్న పార్టీలే రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి తమ రాజకీయ ప్రయోజనాలు, స్థానిక బలాబలాలకు అనుగుణంగా వేర్వేరు వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు కీలక అంశంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ.. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్ని సీట్లు ఎవరికి అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ సమాన ప్రాతిపదికన సీట్ల పంపకాన్ని కోరుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి గతంలో వెల్లడించారు. మరోవైపు ఎస్‌పీ మొత్తం 403 స్థానాల్లోనూ సన్నద్ధత కొనసాగిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. దీంతో కూటమి ఉంటుందా? ఉంటే సీట్ల పంపకం ఎలా ఉంటుంది? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో పోటీ కొనసాగుతోంది. అదే సమయంలో ఇతర పార్టీలతో కొత్త పొత్తులపై చర్చలు కూడా సాగుతున్నాయి. అంటే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేసిన పార్టీలే రాష్ట్రంలో పరస్పరం ప్రత్యర్థులుగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. గోవాలోనూ పరిస్థితులు ఇందుక భిన్నంగా ఏమీ లేవు. ఆ రాష్ట్రంలో ఆప్, గోవా ఫార్వర్డ్ పార్టీ కలిసి ‘గోవా ఫస్ట్’ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా తాము ముందుకు వస్తామని ప్రకటించింది. కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య ప్రధాన సమస్య సీట్ల సంఖ్య మాత్రమే కాదు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి స్థానికంగా బలం ఉంది? గత ఎన్నికల్లో ఎవరి అభ్యర్థికి మెరుగైన ఫలితం వచ్చింది? పార్టీకి ఉన్న ఓటు బేస్ ఎంత? స్థానిక నాయకత్వం ఎలా ఉంది? వంటి అంశాలు సీట్ల పంపకంలో కీలకంగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోనూ అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపుపై చర్చ జరగాలని ఎస్‌పీ వర్గాలు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో కూటమి పేరుతో ఒకే ఫార్ములాను రాష్ట్రాలన్నింటిలో అమలు చేయడం కష్టమవుతోంది. ఇండియా( INDIA)కూటమిలో సమన్వయం కూడా మరో కీలక అంశంగా మారింది. 2023లో ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఒక్కసారి మాత్రమే సమావేశమైందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కమిటీ ప్రధానంగా ప్రచార సమన్వయం, సీట్ల సర్దుబాటు చర్చలను వేగవంతం చేయడం వంటి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. 2026 జూన్‌లో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగినప్పుడు ప్రతి రె