Kaizer News

Dreams: ఒకే వ్యక్తి పదే పదే కలలో కనిపిస్తున్నారా.?

Dreams: ఒకే వ్యక్తి పదే పదే కలలో కనిపిస్తున్నారా.? అర్థం ఏంటో తెలుసా.?

· State - Telangana · hmtvlive.com

Dreams: నిద్రలో కలలు రావడం సహజమైన ప్రక్రియ. మన రోజువారీ అనుభవాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, గత జ్ఞాపకాలు కలల రూపంలో కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఒకే వ్యక్తి తరచూ కలలోకి వస్తుంటే దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నచ్చిన వ్యక్తి లక్షణాలు, ప్రవర్తన లేదా ఆలోచనా విధానం మనపై బలమైన ప్రభావం చూపితే, వాటి గురించి మనం తెలియకుండానే ఆలోచించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎవరిలోనైనా ఉన్న దయ, ధైర్యం, క్రమశిక్షణ వంటి లక్షణాలు మనకు నచ్చితే వాటిని మనసు పదే పదే గుర్తుచేసుకోవచ్చు. ఈ ఆలోచనలు నిద్ర సమయంలో కలలుగా బయటపడే అవకాశం ఉంది. మనసులో నెరవేరని కోరికలు, చెప్పలేకపోయిన మాటలు లేదా బలమైన భావోద్వేగాలు ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచనలు కొనసాగుతుంటాయి. ప్రేమ, అభిమానం, కోపం, భయం, బాధ వంటి భావాలు కూడా ఒక వ్యక్తిని తరచూ గుర్తుకు తెచ్చే అవకాశం ఉంది. నిద్రలో మెదడు ఈ అనుభవాలను ప్రాసెస్ చేసే సమయంలో అదే వ్యక్తి కలలో కనిపించవచ్చు. మన జీవితంలో జరిగిన సంఘటనలు పూర్తిగా మర్చిపోయినట్లు అనిపించినా వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మెదడులో ఉండొచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తితో కలిసి గడిపిన సందర్భాలు లేదా ఆ వ్యక్తితో ముడిపడిన ముఖ్యమైన సంఘటనలు నిద్ర సమయంలో మళ్లీ గుర్తుకు రావచ్చు. అందుకే గతంలో మన జీవితంలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా కలలో కనిపించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి వంటి మనకు దగ్గరైన వ్యక్తులతో బలమైన భావోద్వేగ బంధం ఉంటుంది. వారితో గడిపిన సమయం, వారి గురించి ఉన్న ఆలోచనలు మనసులో ఎక్కువగా ఉండొచ్చు. దీంతో నిద్రలో మెదడు ఆ సంబంధానికి సంబంధించిన జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తూ వారిని కలలో చూపించవచ్చు. ఇది తప్పనిసరిగా ఏదైనా భవిష్యత్ సంఘటనకు సంకేతం అని అర్థం కాదు. పరిష్కారం కాని సమస్యలు లేదా అసంపూర్తి సంబంధాలు ఎవరితోనైనా మనస్పర్థలు, అపార్థాలు లేదా పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటి గురించి మనసులో ఆలోచనలు కొనసాగవచ్చు. సమస్యకు పరిష్కారం దొరకకపోవడం, చెప్పాల్సిన విషయం చెప్పలేకపోవడం వంటి పరిస్థితులు కూడా ఆ వ్యక్తిని మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చే అవకాశం ఉంది. దీంతో అదే వ్యక్తి కలలో పదే పదే కనిపించవచ్చు. ఒకే వ్యక్తి పదే పదే కలలో కనిపించడం అనేది తప్పనిసరిగా శుభం, అశుభం లేదా భవిష్యత్తులో జరగబోయే విషయానికి సంకేతం కాదు. కలలు వ్యక్తి అనుభవాలు, భావోద్వేగాలు, ఆలోచనల ఆధారంగా మారుతుంటాయి. తరచూ వచ్చే కలల వల్ల నిద్రకు ఆటంకం కలిగినా, తీవ్ర ఆందోళనకు గురైనా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను

Original source: hmtvlive.com
Read more on Kaizer News