మచిలీపట్నంలో రహస్య వివాహిత భర్త మోసం చేయడంతో నిరసన. అద్దె ఇంట్లో వదిలేసి, అత్తగారు దూషించడంతో బాధితురాలి ఆవేదన. భర్త తండ్రి వివాహం ఒప్పుకున్నా, బాధితురాలు న్యాయం కోసం విజ్ఞప్తి. Machilipatnam News | మచిలీపట్నం: అనాథ అయిన తనను పెళ్లయిన కొన్నిరోజులకే భర్త మోసం చేశాడని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ వివాహిత న్యాయం కోసం పోరాడుతోంది. రహస్యంగా వివాహం చేసుకున్న భర్త కొద్దిరోజులకే భార్యను ఒంటరిగా వదిలేసి ముఖం చాటేయడంతో, బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తవారి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆగస్టు 30న పెంకు ఫణి కుమార్, జయలక్ష్మి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన అనంతరం ఈ దంపతులు మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ సమీపంలో ఉన్న అత్తగారి ఇంట్లో కొద్దిరోజులు బస చేశారు. ఆ తర్వాత, తమ వివాహం రహస్యంగా జరగడం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనే నెపంతో ఫణి కుమార్ శక్తి గుడి ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో కలిసి అక్కడ కొత్త కాపురం పెట్టాడు. అయితే, కొన్ని రోజులకే భార్య జయలక్ష్మిని ఆ అద్దె ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఆయన పరారయ్యాడు. భర్త ఫణి కుమార్ ఆచూకీ కాకపోవడంతో న్యాయం కోసం అత్తవారింటికి వెళ్లిన జయలక్ష్మిని వారు తీవ్రంగా అవమానించి, తిట్టి, దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. దీంతో తన భర్తను తనకు అప్పగించి, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అత్తవారి ఇంటి ఎదుట జయలక్ష్మీ నిరసనకు దిగింది. ఈ వివాదంపై ఫణి కుమార్ తండ్రి స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తన కొడుక్కి జయలక్ష్మితో వివాహం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. పెళ్లయిన తర్వాత నాలుగు రోజులు తమ ఇంట్లోనే ఉన్నారని, ఆ తర్వాత వేరే కాపురం పెట్టేందుకు బయటకు పంపామని తెలిపారు. ప్రస్తుతం తన కొడుకు ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని, అయితే ఫోన్‌లో మాత్రం అందుబాటులో ఉన్నాడని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి త్వరలోనే పెద్దల సమక్షంలో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. తాను అనాథనని, తనకు తల్లిదండ్రులు లేరని తెలిపింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటామని చెప్పారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ చేస్తున్నట్లు కొల్లు రవీంద్ర సైతం ఆడబిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. తనకు టీడీపీ ఎమ్మెల్యే, అధికారులు న్యాయం చేయకపోతే త్వరలోన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తన సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరతానన్నారు. అనాథను అయిన తనను ఇలా మోసం చేయడం సరికాదని, తన తరఫున ప్రశ్నించే వారు లేరని ఇలా అన్యాయం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. Frequently Asked Questions మచిలీపట్నంలో తన అత్తగారి ఇంటి ముందు నిరసన తెలుపుతున్నది ఎవరు? తన భర్త రహస్యంగా వివాహం చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ జయలక్ష్మి అనే వివాహిత తన అత్తగారి ఇంటి ముందు నిరసన తెలుపుతోంది. ఆమెకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. ఆమె భర్త పెంకు ఫణి కుమార్ ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చే