Kaizer News

Marripadu: చాబోలు పోలేరమ్మ జాతరలో పాల్గొన్న బైరెడ్

Marripadu: చాబోలు పోలేరమ్మ జాతరలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చాబోలు గ్రామంలో పోలేరమ్మ జాతర ఆధ్యాత్మిక సందడితో ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, శాప్‌ మాజీ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొని పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, పరిశీలకులు కూనం సుధాకర్‌రెడ్డిలతో కలిసి చాబోలుకు చేరుకున్నారు.గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయానికి చేరుకున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి స్థానిక నాయకులు, గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బైరెడ్డి ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చాబోలు పర్యటనకు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు నాయకులు, యువత ఆయనను కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. బైరెడ్డితో ఆత్మీయంగా ముచ్చటించి స్థానిక పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాకతో యువతలో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనను కలిసేందుకు రావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News