మమత మెడికల్ కాలేజీలో సీటు.. అభినందించిన ప్రజాసంఘాల నాయకులు ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఎక్స్ రోడ్ సమీపంలోని సేవాదాస్‌నగర్‌కు చెందిన ఉట్నూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బానోత్ జగన్ నాయక్ మూడో కుమారుడు బానోత్ తరుణ్ ఎంబీబీఎస్ సీటు సాధించారు. హైదరాబాద్ బాచుపల్లిలోని మమత మెడికల్ కాలేజీలో ఆయనకు ఎంబీబీఎస్ సీటు లభించింది. ఈ సందర్భంగా ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం జగన్ నాయక్‌తో పాటు ఆయన కుమారుడు తరుణ్‌ను ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రామారావు మాట్లాడుతూ తరుణ్ బాగా చదువుకుని తల్లిదండ్రుల పేరు ప్రతిష్ఠలు నిలబెట్టాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు సేవ చేయాలని కోరుతూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అడ్వకేట్ జాదవ్ రాజేష్ నాయక్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజ్మీర వినోద్, నాయకులు ఆడే దినేష్ తదితరులు పాల్గొన్నారు