Kaizer News

Airport-Warangal | మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి

Airport-Warangal | మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి రూ.213 కోట్లతో టెండర్లు

· State - Telangana · prabhanews.com

మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి రూ.213 కోట్లతో టెండర్లు Airport-Warangal | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్‌ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.213 కోట్ల నిధులను కేటాయించి, శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లలో పాల్గొనేందుకు నవంబర్‌ 3వ తేదీ వరకు గడువు విధించింది. పనులను 18 నెలల్లో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ణయించింది. మంజూరైన నిధులతో మామునూరు విమానాశ్రయంలో డొమెస్టిక్‌ టెర్మినల్‌ భవనం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టవర్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. విమానాశ్రయ అభివృద్ధి పూర్తయితే వరంగల్‌ ప్రాంతానికి విమాన రాకపోకలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించనుంది

Original source: prabhanews.com
Read more on Kaizer News