Kaizer News

Penamaluru: కార్యకర్తల కుటుంబాలకు అండగా టీడీపీ: ఎమ

Penamaluru: కార్యకర్తల కుటుంబాలకు అండగా టీడీపీ: ఎమ్మెల్యే బోడే ప్రసాద్!

· State - Telangana · hmtvlive.com

పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ క్రియాశీల సభ్యులు స్వర్గీయ కొల్లి సురేష్ బాబు గారు,పత్రి వరహాల రావు గారు,కోడాలి రాజేంద్ర గారు అకాల మరణం చెందడంతో వారి కుటుంబాలకు పార్టీ తరఫున భరోసా కల్పించారు. టీడీపీ కార్యకర్తల ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ.15 లక్షల బీమా మొత్తానికి సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్త అంటే కేవలం ఎన్నికల సమయంలో పనిచేసే వ్యక్తి కాదు. పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడు,కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు,అతని కుటుంబానికి అండగా నిలవడం మా బాధ్యత,కార్యకర్తల సంక్షేమం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది అని అన్నారు. గత పాలనలో కార్యకర్తలను కేవలం రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుని,వారి కష్టాలను పట్టించుకోని వారు. ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు విమర్శించారు. ఎవరు కార్యకర్తలను పట్టించుకున్నారో. ఎవరు కార్యకర్తలను వదిలేశారో ప్రజలకు తెలుసు,టీడీపీ మాత్రం మాటలతో కాదు. ప్రతి సందర్భంలో చేతల్లో చూపిస్తోంది అని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలవడం,వారి కష్టాల్లో భాగస్వాములు కావడం టీడీపీ విధానమని తెలిపారు. స్వర్గీయ కొల్లి సురేష్ బాబు గారు, పత్రి వరహాల రావు గారు,కోడాలి రాజేంద్ర గార్ల సేవలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్మరించుకుంటూ. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News