Haribabu Murder Case: హరిబాబు హత్యకేసు నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే హరిబాబును సంతోష్ హత్య చేసినట్లు తెలిపారు. "ఈ నెల 17న నిజామాబాద్ లోని ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద హత్య జరిగింది. తల్లి, బంధువుల సహకారంతో హరిబాబును సంతోష్ హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు కర్రలు, కారును స్వాధీనం చేసుకున్నాం. హత్యలో మిగతా నలుగురి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సంతోష్‌తో పాటు అతడి తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ నేరాన్ని ప్రోత్సహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది." అని వివరించారు. అయితే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను సీపీ వివరించారు. హరిబాబును హత్య చేసిన అనంతరం సంతోష్ ఆంధ్రాకు పారిపోయేందుకు ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అతడిని ట్రేస్ చేసి నిజామాబాద్ బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే బెయిల్‌పై బయటకి వచ్చిన హరిబాబు నిజామాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న నిందితులు పక్కా ప్లాన్‌తో మర్డర్ చేశారని తెలిపారు