Kaizer News

‘మరో రోహిత్‌ వేముల..’ దళిత పీహెచ్‌డీ విద్యార్థి ఆవ

‘మరో రోహిత్‌ వేముల..’ దళిత పీహెచ్‌డీ విద్యార్థి ఆవేదన

· National - India · sakshi.com

కౌలాలంపూర్‌: మలేషియాలో పీహెచ్‌డీ చేస్తున్న తమిళనాడుకు చెందిన దళిత విద్యార్థి స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా తన పరిశోధన ఆరు నెలలుగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ ఫీజులు చెల్లించకపోవడంతో తన చదువు ఆగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను మరో రోహిత్‌ వేములా చూస్తున్నారని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే స్కాలర్‌షిప్‌లో భాగంగా ఇప్పటికే నిధులు విడుదల చేశామని, మిగిలిన పరిశోధన నిధులకు అవసరమైన పత్రాలు, విశ్వవిద్యాలయ సిఫారసు అందాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మదురైకి చెందిన భరతిదాసన్‌ రామన్‌ మలేషియాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా లో టిష్యూ ఇంజినీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నల్ అంబేడ్కర్ ఓవర్సీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ ద్వారా ఆయనకు ఆర్థిక సహాయం అందుతోంది. గురువారం విడుదల చేసిన వీడియోలో స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో జాప్యం వల్ల తన పరిశోధనకు ఆటంకం కలుగుతోందని రామన్‌ ఆరోపించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, లేదంటే ఏదో ఒక విషయం స్పష్టంగా చెప్పాలని, అప్పుడు తాను ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటానని తెలిపారు. తన రెండో ఏడాది పరిశోధన కోసం రూ.19.50 లక్షలు అవసరమని రామన్‌ కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే పరిశోధనకు సంబంధించిన ఖర్చుల అంచనాలు, బిల్లులకు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ సిఫారసు లేదని సామాజిక న్యాయశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 17న యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఈమెయిల్‌ పంపి, పరిశోధనకు అవసరమైన సామగ్రి, ఖర్చులపై ధ్రువీకరణ కోరినట్లు తెలిపింది. ఆ ఇమెయిల్‌ ప్రతిని విద్యార్థికి కూడా పంపినట్లు వెల్లడించింది. సామాజిక న్యాయశాఖ వివరణ రామన్‌కు తొలి విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం నిధులను విడుదల చేసినట్లు తమిళనాడు సామాజిక న్యాయశాఖ తెలిపింది. ట్యూషన్ ఫీజు, వీసా, విమాన ప్రయాణం, జీవన వ్యయం, పరిశోధన ఖర్చులు ఇందులో ఉన్నాయని పేర్కొంది. పరిశోధన, జీవన వ్యయాలకు సంబంధించిన ఖర్చులకు బిల్లులు, వోచర్లు సమర్పించాల్సి ఉందని తెలిపింది. కొన్ని పరిశోధన సామగ్రికి సంబంధించిన బిల్లులు, చెల్లింపు ఆధారాలు సకాలంలో సమర్పించలేదని, కొన్నింటిని ఆగస్టు 20న సమర్పించారని వివరించింది. రెండో ఏడాదికి రూ.12 లక్షలు, అందులో యూనివర్సిటీ ఫీజుగా రూ.5.57 లక్షలు, జీవన వ్యయాల కోసం రూ.6.65 లక్షలు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా తొలి రెండు సంవత్సరాలకు రూ.48 లక్షలు అందించినట్లు పేర్కొంది. ప్రభుత్వ వాదనను ఖండించిన రామన్‌ ప్రభుత్వ వాదనను రామన్‌ ఖండించారు. ప్రభుత్వం ప్రస్తావిస్తున్న రూ.36 లక్షలు తనకు ఇప్పటికే అందిన మొదటి ఏడాది కేటాయింపేనని, తాను కోరుతున్నది రెండో ఏడాది పరిశోధనకు సంబంధించిన అదనపు నిధులని ఆయన చెబుతున్నారు. రెండో ఏడాది పరిశోధన నిధులు విడుదల కాకపోవడంతో తన పని నిలిచిపోయిందని, అక్టోబర్‌ ప్రారంభంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరిశోధనా పత్రాన్ని సమర్పించే అవకాశం కూడా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అవసరమైన పత్రాలు సక్రమంగా సమర్పించి, వ

Original source: sakshi.com
Read more on Kaizer News