Kaizer News

సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు

సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు

· State - Telangana · sakshi.com

సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం.. అగ్గిరాజేసింది. గ్రూపులుగా ఏర్పడి గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ దాడుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో వెంకటేశ్వర్లు, సైదా ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా వచ్చి చేరడంతో ఆ గొడవ మరింత పెద్దదైంది. ఈలోపు మాటా మాటా పెరగడంతో.. రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నారు. ఈ క్రమంలో గొడ్డళ్లతో దాడులకు దిగారు. దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయలపాలైన సైదా ఆస్పత్రికి తరలించే క్రమంలో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎస్సై నవీన్‌పైనా ఓ వర్గంలోని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. ఆయన తలకు తీవ్రగాయాలు కావడంతో.. గాయపడిన వాళ్లతో కలిపి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: జిమ్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!? నేపాల్ ప్రమాదానికి కారణం ఆ ఒక్క మంచు గడ్డనే..! టూరిస్ట్ సంచలన నిజాలు విశాఖలో విషాదం.. ఇద్దరి పిల్లలతో దంపతులు ఆత్మహత్య

Original source: sakshi.com
Read more on Kaizer News