Kaizer News

జీఎస్‌ఓ, జియో స్టేషనరీ ఆర్బిట్ల మధ్య తేడా ఏంటి ? ఉ

జీఎస్‌ఓ, జియో స్టేషనరీ ఆర్బిట్ల మధ్య తేడా ఏంటి ? ఉపగ్రహ కక్ష్యల ప్రత్యేకతల గురించి తెలుసుకోండి!

· State - Telangana · v6velugu.com

కక్ష్య అంటే అంతరిక్షంలోని ఒక వస్తువు (గ్రహం, చంద్రుడు, గ్రహశకలం లేదా అంతరిక్ష నౌక) గురుత్వాకర్షణ కారణంగా మరో వస్తువు చుట్టూ వక్రమార్గంలో నిరంతరం పరిభ్రమించే పథం. తమ విధి నిర్వహణకుగాను ఉపగ్రహాలను భూమి చుట్టూ సముద్ర మట్టం నుంచి 100 కి.మీ. అంతకుమించిన ఎత్తుల్లో ఉండే నిర్దేశిత మార్గాల్లో ప్రవేశపెడతారు. ఈ మార్గాలు వృత్తాకార, దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలు అన్ని సమయాల్లో భూమికి సమాన దూరంలో ఉండవు. భూమికి, ఉపగ్రహానికి మధ్య ఉండే కనిష్ట దూరాన్ని పెరిజీ అంటారు. గరిష్ట దూరాన్ని అపోజీ అంటారు. ప్రతి కక్ష్యలో ఉపగ్రహం స్థిరంగా పరిభ్రమించడానికి దానికి అందించాల్సిన కనీస వేగాన్ని కక్ష్యావేగం అంటారు. భూమి చుట్టూ సముద్ర మట్టానికి 100 కి.మీ.(62 మైళ్లు) ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహం కక్ష్యా వేగం సెకనుకు 7.8 కి.మీ. ఉంటుంది. సుదూర కక్ష్యల్లో ఉపగ్రహాల కక్ష్యావేగం నెమ్మదిగా ఉంటుండగా, ఈ కక్ష్యల లోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి అధిక సామర్థ్యం కలిగిన వాహక నౌకలు అవసరం. భూ నిమ్న కక్ష్యలు (లో ఎర్త్​ ఆర్బిట్) ఇవి భూమి నుంచి 160 నుంచి 2000 కిలోమీటర్ల ఎగువన ఉంటాయి. వీటిలో ఉపగ్రహ కక్ష్య వేగం గంటకు 27,400 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా భూ నిమ్న కక్ష్యలోనే ఉంది. ఈ కక్ష్యల్లోని అత్యధిక ఉపగ్రహాలు ఎదుర్కొనే ప్రధాన ముప్పు అట్మాస్ఫియర్ డ్రాగ్. అంటే వాతావరణంతో ఈ ఉపగ్రహాలు లాగివేయబడుతాయి. భూమికి దూరంగా ఉన్న కక్ష్యలతో పోలిస్తే దగ్గరగా ఉన్న కక్ష్యల్లో ఈ ముప్పు అధికం. ధ్రువ కక్ష్యలు (పొలార్​ ఆర్బిట్స్) ఈ కక్ష్యల్లో పరిభ్రమించే ఉపగ్రహాలు నిరంతరం ఉత్తర, దక్షిణ ధ్రువాలను చుట్టి వస్తాయి. ధ్రువ కక్ష్యల్లో పరిభ్రమించే ఉపగ్రహాలు ఒక రోజులో భూమిని పూర్తిగా పరిశీలించి భూ సంబంధిత చిత్రాలు తీయగలవు. ఈ కక్ష్యల్లో సాధారణంగా రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాలు, వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు, సైనిక ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. ఈ రకమైన ఉపగ్రహాలు రోజులో ఏదో ఒక సమయంలో మాత్రమే సూర్యుడికి ఎదురుగా ఉంటాయి. సూర్యుని వల్ల ఏర్పడే భూమి నీడలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఉపగ్రహాల కక్ష్యా వేగం 7.5 కేఎంపీఎస్ ఉంటుంది. పూర్తి పరిభ్రమణానికి సుమారు 100 నిమిషాల సమయం పడుతుంది. సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలు(సన్​ సింక్రోనస్​ పొలార్ ఆర్బిట్స్) ధ్రువ కక్ష్యల్లో పరిభ్రమించే ఉపగ్రహాన్ని నిరంతరం సూర్యునికి ఎదురుగా ఉంటూ భూమి చుట్టూ పరిభ్రమించేలా ప్రయోగిస్తారు. ఈ రకమైన కక్ష్యలను సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలు అని పిలుస్తారు. దీని అర్థం ఉపగ్రహం ఎల్లప్పుడూ ఒకే స్థానిక సమయంలో ఒకే ప్రదేశాన్ని సందర్శిస్తుంది. ఉదాహరణకు ప్రతిరోజు మధ్యాహ్నం సరిగ్గా హైదరాబాద్​ నగరం మీదుగా ప్రయాణించడం. ఒక స్థలాన్ని ఒకే సమయంలో కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలపాటు పరిశీలించడానికి ఈ ఉపగ్రహాలు తోడ్పడుతాయి. అందుకే ఈ ఉపగ్రహాలు అందించే సమాచారం వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనాల్లో ఉపయోగపడతాయి. నిరంతరం సౌరశక్తి అవసరం ఉన్న ఉపగ్రహాలను dawn–to– dusk orbit​ అనే ప్రత్యేక ఎస్ఎస్​పీవో లోనిక

Original source: v6velugu.com
Read more on Kaizer News