Kaizer News

రేవంత్‌.. 33 కోట్లు.. 308 ఎకరాలెక్కడివి?

రేవంత్‌.. 33 కోట్లు.. 308 ఎకరాలెక్కడివి?

· State - Telangana · ntnews.com

దండు మల్కాపూర్‌లో నీ భార్యకు 30 ఎకరాలెలా వచ్చాయి నీ తమ్ముడికి 200 కోట్ల భూములెలా కట్టబెడ్తావ్‌ సీఎం రేవంత్‌రెడ్డీ.. వీటికి ముందు సమాధానం చెప్పు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 నమస్తే తెలంగాణ): ‘2009లో రూ.3 కోట్ల ఆస్తులున్న రేవంత్‌కు 2023 నాటికి రూ.33 కోట్ల ఆస్తులు, 308 ఎకరాల భూములెలా వచ్చాయి. దండు మల్కాపూర్‌లో ఆయన భార్య పేరిట 30 ఎకరాలు ఎక్క డి నుంచి వచ్చాయి’ అని కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అతి తక్కువ ధరకే రూ.200 కోట్ల విలువైన భూములను సొంత త మ్ముడికి ఎలా కట్టబెట్టారని ధ్వజమెత్తా రు. 1985 నుంచి ఎమ్మెల్యేగా, కేంద్ర, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా పనిచేసిన తెలంగాణ ఉద్యమ సారథి, తొలి సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ భూములుంటే తప్పా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణను సాధించిన ఆలయం వంటి కేసీఆర్‌ ఇంటిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబానికి 67 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే లక్ష కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్‌ నేతలు అసత్య ఆ రోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. క్రిశాంక్‌ ఇంటిలో విధ్వంసం సృష్టించి, చిన్న పిల్లలను ఏడిపించడం ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నదని బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ విమర్శించారు. సమావేశంలో నాయకులు గాంధీనాయక్‌, రవినాయక్‌, కిషన్‌ నాయక్‌ పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News