ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా పెద్ద సంచలనంగా మారింది. ఇండియాలో IAS అధికారిగా రాణించిన ఆమె 13 ఏళ్ల కరియర్‌లో ఎన్నో విజయాలు, మరెన్నో కీలక మైలు రాళ్లు. 75 ఏళ్ల నాటి నీటి సమస్య పరిష్కారం మొదలు రాజీనామా వరకు దివ్యమిట్టల్ ప్రస్తానం వైరల్‌గా మారింది. ఇన్నేళ్ల సర్వీసు తరువాత రాజీనామా చేయడంతో మాజీ బ్యూరోక్రాట్ దంపతులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. దివ్య మిట్టల్, ఆమెభర్త గగన్‌దీప్, లండన్‌లో లక్షల విలువైన ప్యాకేజీని వదిలిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, గగన్‌దీప్ సింగ్ ధిల్లాన్ తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ ర్యాంకును పొందగా, దివ్య మిట్టల్ 2012లో తన రెండవ ప్రయత్నంలో అఖిల భారత ర్యాంకు 68 సాధించారు. అలా డియోరియాలో కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడంతోపాటు, అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. కేవలం బీజేపీ ఎంఎల్‌ఏ ఆరోపణలు, ఫిర్యాదుల కారణంగా మే 6న డియోరియా నుండి బదిలీ చేశారా? లాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. దివ్య మిట్టల్ ప్రత్యేకతలు, వివాదాలు లండన్‌లో ట్రేడింగ్ వృత్తిని వదిలిపెట్టిన మరీ IAS అధికారి కావాలనే కల సాకారం కోసం ఆమె ఇండియాకు తిరిగి వచ్చారు. మీర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా (2023) పనిచేసిన సమయంలో జల్ జీవన్ మిషన్ కింద ఆమె చేసిన కృషి, సేవ ప్రత్యేకంగా నిలుస్తుంది. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మీర్జాపూర్‌లోని లహరియా దాహ్ గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పించింది మాత్రం దివ్య మిట్టలే అని మీర్జాపూర్ ప్రజలు ఇప్పటికీ చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మీర్జాపూర్ నుండి పోటీ చేసే అవకాశం ఉందా అనే ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి. లహూరియా దాహ్ గ్రామానికి పైపుల ద్వారా నీటి సరఫరా లేదు. కానీ ఆమె కృషితో జల్ జీవన్ మిషన్ కింద ఆ గ్రామానికి 75 ఏళ్లలో తొలిసారిగా కుళాయి నీరు అందింది. ఈ విషయాన్ని ఆమె తన రాజీనామా లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొండ ప్రాంతం, పైప్‌లైన్‌లు విజయవంతంగా అందుబాటులోకి వచ్చాయి. 125 ఇళ్లకు కనెక్షన్లు, సుమారు 1,200 మంది నివాసితులు లబ్ధి పొందారు. సుదీర్ఘ తీవ్రమైన తాగునీటి సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు, కాలానుగుణంగా వచ్చే నీటి ఊటపై, ఖరీదైన ప్రైవేట్ ట్యాంకర్లే ఆధారం. నీటి కోసం ప్రతీ రోజూ కాలి నడకన వెళ్లి అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. అయితే ఈ కార్యక్రమంలో ఆమెను ప్రోటోకాల్ పాటించలేదంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి యోగీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆయనను ఆహ్వానించలేదనే ఆరోపణల మధ్య ఆమెను బదిలీ చేశారన్న ఆరోపణలు గుప్పు మన్నాయి. ఆ తరువాత దివ్యను బదిలీ చేశారు. 'వెయిటింగ్ లిస్ట్'లో ఉంచారు. అంతేకాదు కొత్తగా వేసిన పైప్‌లైన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నీటి సరఫరా మళ్లీ నిలిచిపోయింది. గ్రామాన్ని తిరిగి నీటి సంక్షోభంలోకి వెళ్లిపోయింది. నెలల తరబడి అధికారిక పోస్టింగ్ ల